వేధింపులకు గురైతే  షీ టీమ్​ను సంప్రదించాలి  : కమిషనర్​ ఎం.శ్రీనివాస్​

వేధింపులకు గురైతే  షీ టీమ్​ను సంప్రదించాలి  : కమిషనర్​ ఎం.శ్రీనివాస్​

 మంచిర్యాల, వెలుగు: ఎవరైనా మహిళలపై వేధింపులకు పాల్పడితే వెంటనే షీ టీమ్​ను సంప్రదించాలని రామగుండం పోలీస్​ కమిషనర్​ ఎం.శ్రీనివాస్​ అన్నారు. స్టేట్​ విమెన్​ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో టీజింగ్, ర్యాగింగ్, వర్క్ ప్లేస్, సోషల్​ మీడియా హరాస్మెంట్ పై రూపొందించిన పోస్టర్లను సోమవారం కమిషనరేట్​ హెడ్​ క్వార్టర్స్​లో రిలీజ్​ చేశారు.

తల్లిదండ్రులు రోజు కాసేపు పిల్లలతో మాట్లాడాలని, వారితో గడిపేందుకు టైమ్​ కేటాయించాలని, సమాజంలోని మంచి చెడుల గురించి అర్థమయ్యేలా చెప్పాలని, పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్  గురించి అవగాహన కల్పించాలని సూచించారు. బాధితులు అత్యవసర సమయాల్లో డయల్​ 100కు కాల్​ చేయాలని, లేదా షీ టీమ్స్ వాట్సాప్ 6303923700 మెసేజ్​ చేయాలని అన్నారు. అడిషనల్ డీసీపీ అడ్మిన్  సీ.రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, మంచిర్యాల జోన్ షీ టీమ్​ ఇన్చార్జి ఎస్సై హైమ పాల్గొన్నారు.