ఖమ్మం రూరల్, వెలుగు : గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఖమ్మం నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు ప్రాంతాన్ని నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ నీరజ, స్తంభాద్రి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన సమయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారిపై అడ్డుగా వైర్లు, చెట్టు కొమ్మలు లేకుండా చొరవ తీసుకోవాలని సూచించారు.
క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు ఉండాలని, సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం అయ్యేలా చూసుకోవాలని సూచించారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ నిమజ్జనాన్ని సక్సెస్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేశ్‌కుమార్, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీ రమణమూర్తి ఇన్స్పెక్టర్ రమేశ్, మోహన్ బాబు, సాంబశివరావు, సంభాద్రి ఉత్సవ కమిటీ విద్యాసాగర్, వినోద్ లహోటి తదితరులు పాల్గొన్నారు.