గ్రే హౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా.. త్వరలోనే సర్కారు ఆర్డినెన్స్

గ్రే హౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా.. త్వరలోనే సర్కారు ఆర్డినెన్స్
  •  6 వారాల తర్వాత అసెంబ్లీలో బిల్లు
  •  చట్టబద్ధతపై సందేహాలు వద్దు
  •  జీవో 99 ద్వారా ఏర్పాటయ్యింది
  •  త్వరలో మరిన్ని అధికారాలు
  •  కమిషనర్ రంగనాథ్ వెల్లడి

హైదరాబాద్: గ్రేహౌండ్స్, టాస్క్ ఫోర్స్ తరహాలో హైడ్రా ఉండబోతోందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. హైడ్రా చట్టబద్దతపై కొందరు హైకోర్టును ఆశ్రయించడంపై ఆయన మాట్లాడుతూ.. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుందని చెప్పారు. జీవో 99 ద్వారా జూలై 19న హైడ్రా ఏర్పాటయ్యిందని వివరించారు. త్వరలోనే  సర్కారు ఆర్డినెన్స్ జారీ చేయనుందని, ఆరు వారాల్లో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతోందని అన్నారు. హైడ్రా చట్టబద్దతపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని అన్నారు. అసెంబ్లీలో బిల్లు పాసైన తర్వాత మరిన్ని విశేష అధికారాలు రాబోతున్నాయని అన్నారు. 

 భూఆక్రమణ చట్టం–1905 సవరణ!

తెలంగాణ భూ  ఆక్రమణ చట్టం-1905కు సవరణ చేసి కొత్త చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  ప్రస్తుతం ఉన్న చట్టంలోని 1ఏ, 7ఏ సెక్షన్లను సవరించనుంది. అసెంబ్లీ సమావేశాలు లేనందున చట్టం తేవడం ప్రస్తుతానికి వీలు కాదు. రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక, జీహెచ్‌ఎంసీ, బీపాస్, వాల్టా, ఫైర్‌ సర్వీసెస్‌ తదితర శాఖలకు చట్టం ద్వారా ఉన్న కొన్ని అధికారాలను, కొన్ని ప్రత్యేక జీవోల ద్వారా ఉన్న అధికారాలను తాజాగా తెచ్చే ఆర్డినెన్స్‌ ద్వారా హైడ్రాకు అప్పగించే అవకాశం ఉంది.

ALSO READ | హైడ్రా రద్దు పిటిషన్‌పై రంగనాథ్ రియాక్షన్ ఇదే.. సంచలన వ్యాఖ్యలు