జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దు

హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులకు సెలవులను కమిషనర్ రొనాల్డ్‌ రాస్‌ రద్దు చేశారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహించే ప్రజాపాలన నేపథ్యంలో  ఆ రోజుల్లో సెలవులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సెలవులు తీసుకున్నవారు మంగళవారం జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

 ప్రజా పాలనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో గ్రేటర్​లో ప్రజా పాలనను విజయవంతం చేసేందుకు కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగా 30 సర్కిల్స్ కి 30 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. ఆయా సర్కిళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.