హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలపై కమిషనర్ రోనాల్డ్ రాస్ సమీక్ష నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోని 6 జోన్లకు సంబంధించిన జోనల్ కమిషనర్లతో సమావేశమైన కమిషనర్.. వారి జోన్ లో వాటర్ స్టాగ్నేషన్, ట్రాఫిక్ వంటి అంశాలపై చర్చించారు. వీటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా రోడ్డుపై పేరుకుపోతున్న బురదను క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు రోనాల్డ్ రాస్.
మరో 5 రోజులపాటు వర్షం కురిసే అవకాశం ఉండడంతో నిరంతరం అలెర్ట్ గా ఉండాలని చెప్పారు. ఎక్కడైన మ్యాన్ హోల్ ఓపెన్ గా కనిపించి.. ఏదైనా ఘటన జరిగితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు . వర్షం పడి, రోడ్లపై నీళ్లు ఆగిన సమయంలో ఇంజనీరింగ్ సిబ్బంది సరిగా ఎందుకు పని చెయ్యడం లేదపి కమిషనర్ రోనాల్డ్ రాస్ సీరియస్ అయ్యారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంజినీరింగ్ సిబ్బంది ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.