
రాజన్న సిరిసిల్ల, వెలుగు:- లింగ నిర్ధారణ టెస్ట్లు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. బుధవారం రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్లో ఆరోగ్య శాఖ పనితీరుపై వైద్యాధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, భ్రూణ హత్యలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ హాస్పిటల్లో అధిక ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కార్ దవాఖానల్లో నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని, అవసరమైతేనే సిజేరియన్లు నిర్వహించాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝా, డీఎంహెచ్వో రజిత, వైద్యాధికారులు డా.లక్ష్మీనారాయణ, డా.పెంచలయ్య, ప్రోగ్రాం ఆఫీసర్లు, పాల్గొన్నారు.