కొండగట్టు మాస్టర్ ప్లాన్ పై మీటింగ్

కొండగట్టు మాస్టర్ ప్లాన్ పై మీటింగ్
  •     8 మందితో కమిటీ ఏర్పాటు 

కొండగట్టు,వెలుగు: ఎన్నో ఎండ్ల నుంచి అంజన్న భక్తులు ఎదురుచూస్తున్న కొండగట్టు మాస్టర్ ప్లాన్ కు మోక్షం కలగనుంది. ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధి కోసం ఎనిమిది మందితో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కమిటీ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ ఎండోమెంట్ ఆఫీసులో మాస్టర్ ప్లాన్ పైన ప్రత్యేక సమావేశమయ్యారు. 

భక్తుల సౌకర్యాలు పరిగణలోకి తీసుకొని, ఆలయ విశిష్టతకు సంప్రదాయాలకు భంగం కలగకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన పనులను ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా బిడ్లకు ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.

 కొండగట్టు ఈవోకు బాధ్యతలు అప్పజెప్పి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, స్థపతి వెల్ది నాయక్, ఈఓ రామకృష్ణ రావు, కొండగట్టు ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

పదో సారి వాయి వాయిదా పడ్డ తలనీలాల టెండర్ 

కొండగట్టు,వెలుగు: కొండగట్టులో సంవత్సరం పాటు తలనీలాలు పోగు చేసుకోవడానికి అధికారులు నిర్వహించిన టెండర్ మరోసారి వాయిదా పడింది.  కొండగట్టు ఆలయంలో ఏడాది పాటు తలనీలాలు పోగు చేసుకోవడానికి నిర్వహించిన టెండర్ ను హైదరాబాదులోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో అధికారులు శుక్రవారం చేపట్టారు. 

 పదిమంది కాంట్రాక్టర్లు టెండర్ లో పాల్గొనగా కేవలం కోటీ 68 లక్షల వరకు మాత్రమే వ్యాపారులు పాట పాడారు.  సరైన ధర రాకపోవడంతో అధికారులు టెండర్లు రద్దుచేసి ఈ నెల 30న మరోసారి  నిర్వహించడానికి తీర్మానించారు. గత కొన్ని ఏళ్లుగా టెండర్లను కొండగట్టులోనే  చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది.  కానీ తలనీలాల టెండర్లు మాత్రం ప్రత్యేకంగా అధికారులు కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయానికి మార్చారు. అనంతరం శుక్రవారం టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్ కమిషనర్ అఫీస్ కు మార్చడం పైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.