యాదాద్రి, వెలుగు: ట్రిబ్యునల్‌లో ఆర్డీవో ఇచ్చిన ఆర్డర్స్ ను వారసులు పట్టించుకోవడం లేదని వయో వృద్ధుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగులు, వయోవృద్ధుల కమిటీ సమావేశంలో సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ మెంబర్లు మాట్లాడుతూ తమ కోసం డే కేర్ సెంటర్‌తో పాటు టెంపరరీ షెల్టర్ ఏర్పాటు చేయాలన్నారు.
ఆస్తిలో వారసులతో సమానంగా తమ వాటానువాడుకునే హక్కు కల్పించాలని కోరారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కుల రక్షణకు ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వేధింపుల నుంచి రక్షణ కోసం చర్యలు తీసుకోవడంతో పాటు ట్రిబ్యునల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరు 1456కు కాల్ చేయాలని సూచించారు.
మీటింగ్‌లో శెట్టి బాలయ్య, ఎర్రగుంట వెంకటేశం, నర్సింగ రావు, సత్యనారాయణ, బాలేశ్వర్, శంకర్ రెడ్డి, సుధాకర్, బాలరాజు, దివ్యాంగుల కమిటీ ప్రెసిడెంట్ సురపంగ -ప్రకాశ్, నర్సింహా, జహాంగీర్, నరేశ్, ఉపేందర్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.