టూరిజం ప్రమోష‌‌‌‌న్‌కు త్వర‌‌‌‌లో క‌‌‌‌మిటీ: ప‌‌‌‌ర్యాట‌‌‌‌క శాఖ మంత్రి జూప‌‌‌‌ల్లి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి వ‌‌‌‌చ్చే  దేశ విదేశీయులు.. ప‌‌‌‌ర్యాట‌‌‌‌క‌‌‌‌, సాంస్కృతిక‌‌‌‌, వార‌‌‌‌స‌‌‌‌త్వ క‌‌‌‌ట్టడాలు, చారిత్రక ప్రాంతాల‌‌‌‌ను సంద‌‌‌‌ర్శించే విధంగా టూరిజం ప్రమోష‌‌‌‌న్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఒర‌‌‌‌వ‌‌‌‌డికి శ్రీకారం చుట్టబోతోంద‌‌‌‌ని టూరిజం శాఖ మంత్రి జూప‌‌‌‌ల్లి కృష్ణారావు తెలిపారు. దీనికి సంబంధించి కార్యాచ‌‌‌‌ర‌‌‌‌ణ రూపొందిస్తున్నామ‌‌‌‌ని, త్వర‌‌‌‌లోనే ఓ క‌‌‌‌మిటీ ఏర్పాటు చేస్తున్నట్టు  తెలిపారు. శుక్రవారం మాదాపూర్​లోని హైటెక్స్​లో ఏర్పాటు చేసిన ట్రవెర్నియా ఫెస్ట్ కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజ‌‌‌‌రై ప్రారంభించారు. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప‌‌‌‌ర్యాట‌‌‌‌క‌‌‌‌,  వార‌‌‌‌స‌‌‌‌త్వ, చారిత్రక ప్రాంతాలు,  ఆయా ప్రాంతాల ప్రజ‌‌‌‌ల  జీవ‌‌‌‌న శైలి, ఆహార‌‌‌‌పు అల‌‌‌‌వాట్లు, సంస్కృతి, సంప్రదాయాల‌‌‌‌ గురించి స‌‌‌‌మాచారాన్ని ప‌‌‌‌ర్యాట‌‌‌‌క ప్రేమికుల‌‌‌‌కు  తెలియ‌‌‌‌జేయ‌‌‌‌డం ల‌‌‌‌క్ష్యంగా ట్రవెర్నియా ఫెస్ట్​ను నిర్వహించారు. మంత్రి జూప‌‌‌‌ల్లి మాట్లాడుతూ..  రాష్ట్ర ప్రభుత్వం ప‌‌‌‌ర్యాట‌‌‌‌క రంగానికి పెద్దపీట వేసింద‌‌‌‌న్నారు. ప‌‌‌‌ర్యాట‌‌‌‌కుల‌‌‌‌తో పాటు జాతీయ‌‌‌‌, అంత‌‌‌‌ర్జాతీయ స‌‌‌‌ద‌‌‌‌స్సులు, స‌‌‌‌మావేశాలు, అధికారిక‌‌‌‌ కార్యక్రమాలు, ఆయా ప‌‌‌‌నుల నిమిత్తం తెలంగాణ‌‌‌‌కు వ‌‌‌‌చ్చే వారిని ప‌‌‌‌ర్యాట‌‌‌‌క ప్రాంతాల‌‌‌‌కు తీసుకువెళ్లేందుకు అనేక ప‌‌‌‌థ‌‌‌‌కాలు చేప‌‌‌‌డుతున్నామ‌‌‌‌ని చెప్పారు. 

వ‌‌‌‌చ్చిన ప్రతీ అవ‌‌‌‌కాశాన్ని స‌‌‌‌ద్వినియోగం చేసుకుంటూ.. తెలంగాణ టూరిజం ప్రమోష‌‌‌‌న్ కోసం కృషి చేస్తున్నామ‌‌‌‌న్నారు. తెలంగాణ ప‌‌‌‌ర్యాట‌‌‌‌క ప్రాంతాల‌‌‌‌ను సంద‌‌‌‌ర్శించి, టూరిజం ప్రమోష‌‌‌‌న్ కు అంబాసిడ‌‌‌‌ర్లుగా నిల‌‌‌‌వాల‌‌‌‌ని కోరుతున్నామ‌‌‌‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూఎన్ టూరిజం అంబాసిడ‌‌‌‌ర్  కార్ల్ జోషువా, ప్రముఖ చరిత్రకారుడు డా. సిన్హారాజా త‌‌‌‌మ్మిట‌‌‌‌, ట్రవేర్నియా ఫెస్ట్ వ్యవ‌‌‌‌స్థాకులు డా. అంతొని విపిన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.