అఫీషియల్..ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కామెడీ డ్రామా మూవీ..స్ట్రీమింగ్ డేట్ ఇదే

మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాణ సంస్థ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌, శ్రీ రాధా దామోదర్‌ స్టూడియోస్‌ బ్యానర్స్ పై నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు (CommitteeKurrollu). ఆగస్ట్ 9న క‌మిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.

డైరెక్టర్ యదు వంశీ తెరకెక్కించిన11 మంది క‌మిటీ కుర్రోళ్ల జాతరకు సినీ ఆడియన్స్ తో పాటుగా సినిమా స్టార్స్ కూడా ఫిదా అయ్యారు. దాదాపు మూడు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన క‌మిటీ కుర్రాళ్లు మూవీ రూ.21 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. నిహారిక‌కు భారీగా లాభాల్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి దీపక్ దేవ్ మ్యూజిక్ అందించాడు.

Also Read:-మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ చూశారా?

కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ:

అచ్చ‌మైన గోదావ‌రి యాస‌తో, పల్లెటూరి మనుషుల ఆలోచన బంధాలతో వచ్చిన కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌తో ఆడియన్స్ ను కట్టిపడేసిన ఈ మూవీ..ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈవీటి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సెప్టెంబరు 12న స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది.ఈ మేర‌కు కొత్త పోస్ట‌ర్‌ను ఈటీవీ విన్ అభిమానుల‌తో పంచుకున్న‌ది. థియేటర్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఏ మాత్రం వ్యూస్ రాబడుతుందో చూడాలి.

కమిటీ కుర్రోళ్ళు క‌థ:

వెస్ట్ గోదావరిలోని ఓ మారుమూల ప‌ల్లెటూరు పురుషోత్తంప‌ల్లి. ఈ ఊరిలో శివ (సందీప్ సరోజ్), సూర్య (యశ్వంత్ పెండ్యాల), సుబ్బు (త్రినాధ్ వర్మ), విలియం (ఈశ్వర్), పెద్దోడు (ప్రసాద్ బెహరా) సహా ఇంకో ఆరు మంది చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎలాంటి కష్టం వచ్చిన ఒకరికొకరు కలిసి పోరాడే స్నేహాలు వీరివి. ఈ ప‌ల్లెటూరులో ప్ర‌తి ప‌న్నెండేళ్ల‌కు ఓ సారి జాత‌ర జ‌ర‌గ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంటుంది. ఈ భ‌రింకాళ‌మ్మత‌ల్లి జాత‌ర‌లో భాగంగా చేసే బ‌లి చేట ఉత్స‌వానికి ఎంతో ప్రాశ‌స్త్యం ఉంది. అలా ఒకరోజు ఒకరంటే ఒకరికి ప్రాణంగా ఉండే స్నేహితులు ఊళ్లో జరిగిన ఓ చిన్న గొడవ కారణంగా ఒక్కసారిగా అందరూ విడిపోతారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత జాతర కోసం అందరూ ఊరికి వస్తారు. ఇక ప‌న్నెండేళ్ల త‌ర్వాత మళ్లీ జాతర జరగనుండటంతో ఎలాంటి గొడవలు జరుగుతాయోనని జనాలు భయపడుతుంటారు. ఈ ప్రత్యేకమైన జాత‌ర‌లో బ‌లిచాట‌ను ఎత్తుకోవ‌డానికి ఆ ఊరి నుంచి ఎవ‌రూ ముందుకు రారు. మ‌రోవైపు కులాల గొడ‌వ‌ల‌ను వాడుకుంటూ ఊరికి చాలా ఏళ్లుగా స‌ర్పంచ్‌గా కొన‌సాగుతాడు పొలిశెట్టి బుజ్జి (సాయికుమార్‌).

అయితే ఈసారి జాత‌ర జ‌రిగిన సరిగ్గా ప‌దిరోజుల‌కు ఊరి స‌ర్పంచ్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఆ ఊరి ప్ర‌స్తుత స‌ర్పంచ్ పై పోటీ చేసేందుకు ఆ ఊరి కుర్రాళ్ల‌లో ఒక‌డైన శివ (సందీప్ స‌రోజ్) ముందుకొస్తాడు. మరి అప్పుడు తమ స్నేహితులందరూ కలిసి ఊరికి వచ్చాకా కలిసి శివని ఎన్నికల్లో గెలిపించుకున్నారా? లేదా మళ్ళీ కొట్లాడుకున్నారా?

స్వార్థ రాజ‌కీయాల కోసం ఊరివాళ్ల‌ను క‌ల‌వ‌కుండా చేయడానికి పొలిశెట్టి బుజ్జి పన్నిన ఆలోచనలు ఏంటీ? బ‌లిచాట‌ను ఎత్తుకునే విష‌యంలో శివ, అత‌డి స్నేహితులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నారు? ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఎలాంటి గొడ‌వ‌లు జ‌రిగాయి? ఊరిలో రెండు వ‌ర్గాలుగా విడిపోయిన వారు ఎన్నిక‌లు కార‌ణంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?..అనేది కథ.