సిట్టింగ్​జడ్జితో కమిటీ వేయాలి..ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ

సిట్టింగ్​జడ్జితో కమిటీ వేయాలి..ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ

ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై సిట్టింగ్​ జడ్జితో కమిటీ వేయాలని ఎస్పీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ జి.చెన్నయ్య, కో -కన్వీనర్లు బేర బాలకిషన్, బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేశ్​బాబు డిమాండ్​చేశారు. మంగళవారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవచ్చని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పుకు తాము వ్యతిరేకమని అన్నారు. 

రాష్ట్రంలో 50 లక్షల మంది మాలలున్నారని,30 ఏండ్లుగా హక్కులతోపాటు రిజర్వేషన్లు కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ ఇదివరకే ప్రకటించారని గుర్తు చేశారు. 

మంద కృష్ణ మాదిగకు ప్రధాని మోదీతో  మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఒప్పించి కులగణన నిర్వహించేలా కృషిచేయాలన్నారు. సమావేశంలో నాను, తాలూకా అనిల్, బైండ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.