
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్షే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్). తాజాగా క్యాట్-2023 నోటిఫికేషన్ వెలువడింది. క్యాట్ స్కోరుతో ఐఐఎంలే కాకుండా పేరున్న కాలేజీలు సీట్లను భర్తీ చేస్తాయి.
అర్హత: కనీసం శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష నవంబర్ 26న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.iimcat.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.