Health alert: రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా.. పెద్ద ప్రేగు క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్లే.. పరిశోధనల్లో సంచలన విషయాలు

Health alert: రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారా.. పెద్ద ప్రేగు క్యాన్సర్ కొని తెచ్చుకున్నట్లే.. పరిశోధనల్లో సంచలన విషయాలు

మనం నిత్యం తీసుకునే ఆహారంలో వంట నూనెలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. నూనెలు లేకుండా ఏ వంటా ఉండుదు..నూనెల అవసరం మన శరీరానికి అంత ఉంటుంది.. నూనెల్లో  ఒమేగా -3, ఒమేగా -6 కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వంటనూనెలను సీడ్స్, పండ్లనుంచి తయారు చేస్తారు. ఇదంతా మనకు తెలుసు.. కానీ మనకు తెలియని విషయం ఇంకోటుంది.. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు చేసిన ఓ అధ్యయనంలో సంచలన విషయాలు బయటికొచ్చాయి.

వంటనూనెలను వినియోగించడం వల్ల ప్రాణాంతకమైన రోగాలు వస్తున్నాయని అమెరికా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఓ పరిశోధన లో తేలింది.  పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. అల్ట్రాప్రాసెస్డ్ డైట్ లలో వంటనూనెలను వినియోగించడం  వల్ల జరుగుతుందని తెలిసింది. ఈ పరిశోధన రిపోర్టును గట్ జర్నల్ లో ప్రచురితమైంది.  

80 మంది పెద్ద ప్రేగు క్యాన్సర్ రోగు నుంచి సేకరించిన కణితులను విశ్లేషించారు. ఇటీవల కాలంలో వేగంగా పెరుగుతున్న క్యాన్సర్లలో ఒకటైన పెద్ద ప్రేగు క్యాన్సర్ కు విత్తనాలు, పండ్ల నూనెల సేకరించిన నూనెలు ప్రధాన కారణమని  పరిశోధకులు చెబుతున్నారు.  విత్తన నూనెల జీవక్రియ విచ్ఛిన్నంలో మిగిలిపోయిన లిపిడ్స్ అనే జిడ్డు పదార్థాలు పెద్ద ప్రేగు క్యాన్సర్ కారణమని తేల్చారు. 

సాధారణంగా వంట నూనెలను పొద్దుతిరుగుడు, కనోలా, మొక్కజొన్న , ద్రాక్ష గింజలు, కుసుమ , రాప్‌సీడ్, సోయాబీన్, వేరుశెనగ, ఆముదం గింజల నుంచి తీస్తారు. వీటినుంచి తీసిన నూనెలు అధికంగా వాడిన ఆహారాన్ని తినడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుందంటున్నారు పరిశోధకులు. ఇది క్యాన్సర్ అభివృద్ధికి దారితీస్తుంది. దీర్ఘకాలిక మంట గుండె పరిస్థితులు, ఆర్థరైటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ లేదా స్ట్రోక్‌కి కూడా దారితీయవచ్చంటున్నారు. 

విత్తన నూనెలు శుద్ది విధానంలో కొన్ని లోపాలు  రోగాలకు కారణం అవుతున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి. బ్లీచింగ్, డీడోరైజింగ్ ,హీటింగ్‌తో ప్రాసెస్ చేయబడతాయి,.ఇది హానికరమైన సమ్మేళనాల సృష్టికి దారి తీస్తుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేసినప్పుడు డీప్ వేయించడానికి లేదా అధిక వేడి వద్ద వంటలో ఉపయోగించినప్పుడు అవి ఆక్సీకరణకు లోనవుతాయి. ఆల్డిహైడ్‌ల వంటి విషపూరితమైన ఉపఉత్పత్తులను ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 

ఈ విషపూరిత సమ్మేళనాలు కణజాలాలను దెబ్బతీస్తాయి. వృద్ధాప్యం ,దీర్ఘకాలిక వ్యాధులకు దోహదం చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. అంతేకాకుండా శుద్ధి ప్రక్రియ గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ ,అధిక రక్తపోటుకు దారితీసే ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్‌ను కూడా పెంచుతుంది. ఇది బరువు పెరగడానికి కూడా దారి తీస్తుందని పరిశోధనలో వెల్లడైంది. 

అధ్యయనం ఏం చెబుతుందంటే.. 

ఈ అధ్యయనం 30 నుంచి85 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల నుంచి 81 కణితి నమూనాలను ఈ అధ్యయనంలో పరిశీలించారు. ఈ కణుతుల్లో  కొన్ని రకాల కొవ్వులు కారణం అయితే.. వీటికంటే ఎక్కువగా ఆయిల్ నుంచి ఏర్పడిన లిపిడ్స్ ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.ఈ లిపిడ్లు కణితి విస్తరణ పెంచడం, క్యాన్సర్ నిరోధక రక్షణవ్యవస్థను నాశనం చేయడం వంటి చేస్తాయని తేలింది. 

పెద్దపేగు క్యాన్సర్‌ చెక్ పెట్టేవి ఇవే.. 

క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి ఆలివ్ లేదా అవకాడో నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో కూడిన నూనెలకు మారాలని శాస్త్రవేత్తల బృందం సలహా ఇస్తోంది. అయితే పెద్ద ప్రేగు క్యాన్సర్ కు నూనెల్లో ఉండే లిపిడ్స్ ఓ కారణం అయితే.. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం, ఎర్ర మాంసం, ప్రాసెస్ చేసిన మాంసాలు, అధిక బరువు లేదా ఊబకాయం, డ్రింకింగ్, పొగ తాగడం, కొంతమందిలో  వారసత్వంగా ప్రేగు క్యాన్సర్‌ వస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. వంటనూనెల్లో ఎంపికలో జాగ్రత్తలో పాటు  వీటిపై దృష్టి సారిస్తే పెద్ద ప్రేగు క్యాన్సర్ ను అరికట్టొచ్చంటున్నారు.