ఇకపై సామాన్యులు కూడా రాకెట్ ప్రయోగాన్ని చూడోచ్చు.

ఇకపై సామాన్యులు కూడా రాకెట్ ప్రయోగాన్ని చూడోచ్చు.

నెల్లూరు: సామాన్యులు సైతం రాకెట్ ప్రయోగాన్ని దగ్గరుండి చూసే అవకాశాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కల్పించనుంది. ఇప్పటివరకు కేవలం అధికారులకు, యాజమాన్యానికి మాత్రమే అందుబాటులో ఉండే సదుపాయాన్ని సామాన్య ప్రజలకూ అందించనుంది. అందుకోసం స్పేస్ సెంటర్ లోని  80 ఎకరాల స్థలంలో  దాదాపు రూ.180 కోట్లతో.. సందర్శకుల కోసం భారీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సదుపాయాలతో  సందర్శకుల గ్యాలరీని నిర్మించింది. దీనికి సంబంధించిన తొలి దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మొదటి విడతలో 5 వేల మంది ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించనుంది. కాగా వచ్చె నెల ఏప్రిల్ 1న శ్రీహరి కోటలో పి.ఎస్.ఎల్వీ C-45 రాకెట్ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించి. ఈ నెల 31న ఇస్రో చైర్మన్ కే.శివన్‌ కౌంట్ డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు.