కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్​

కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్ట్​

దేశంలోని సెంట్రల్​ యూనివర్సిటీలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, డీమ్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు నిర్వహించే కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెస్టు (సీయూఈటీ) నోటిఫికేషన్ విడుదలైంది.   దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థలు పీజీ కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నాయి.

కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎ, ఎంపీఏ, ఎంబీఏ, మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఎడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం, ఎంసీఏ, ఎంకాం.అర్హత: ఇప్పటికే డిగ్రీ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఫైనల్​ ఇయర్​ కోర్సుల్లో ఉన్న విద్యార్థులు సీయూఈటీ రాసుకోవచ్చు. పలు కోర్సులకు ఏదైనా డిగ్రీ సరిపోతుంది. మిగిలినవాటికి డిగ్రీలో సంబంధిత కోర్సు చదివినవారై ఉండాలి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఆన్​లైన్​లో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ప్రశ్నలు ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హిందీ మీడియంలో (లాంగ్వేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాహిత్య పేపర్లు తప్ప) ఉంటాయి. ఇందులో పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఎ, పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-బి అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఎ 25, పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-బిలో 75 ప్రశ్నలు వస్తాయి. పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ఎలో జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-బిలో సంబంధిత సబ్జెక్టు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. 
దరఖాస్తులు: ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19 వరకు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.cuet.nta.nic.in వెబ్​సైట్​లో సంప్రదించవచ్చు.