ప్రపంచవ్యాప్తంగా కామన్వెల్త్ కథానికల కాంపిటీషన్లో పోటీపడిన 7359 మందిలో ముంబయికి చెందిన 26ఏండ్ల సంజనా ఠాకూర్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఆమెకు 5000 పౌండ్ల నగదు బహుమతి ప్రదానం చేస్తారు. సంజనా ఠాకూర్ రాసిన ఐశ్వర్యా రాయ్ శీర్షికకు ఈ బహుమతి లభించింది. ఈ బహుమతి గెలుచుకున్న రెండో భారతీయ రచయిత్రిగా, మూడో రచయితగా రాకూర్ నిలిచారు.
గతంలో ఈ బహుమతిని గెలుచుకున్న భారతీయ రచయితులు పరాశర్ కులకర్ణి (2016) రచించిన కౌ అండ్ కంపెనీ కథ, కృతికా పాండే (2020) ది గ్రేట్ ఇండియన్ టీ అండ్ స్నేక్స్కు లభించాయి.