ఆటకు షట్లర్ సుమీత్ రెడ్డి వీడ్కోలు

ఆటకు షట్లర్ సుమీత్ రెడ్డి వీడ్కోలు

న్యూఢిల్లీ : ఇండియా బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్, హైదరాబాదీ బి. సుమీత్ రెడ్డి ప్రొఫెషనల్ కెరీర్‌‌‌‌‌‌‌‌కు రిటైర్మెంట్‌‌‌‌ పలికాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌‌‌‌లో ఇండియా మిక్స్‌‌‌‌డ్ టీమ్‌‌‌‌కు సిల్వర్ మెడల్ అందించిన సుమీత్  ఇకపై పూర్తిగా కోచింగ్‌‌‌‌పై దృష్టి సారించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.   ‘గర్వంతో ఆటకు వీడ్కోలు పలుకుతున్నా. కొత్త అధ్యాయాన్ని కృతజ్ఞతతో ఆహ్వానిస్తున్నాను. ఇన్నాళ్లు నాకు మద్దతు ఇచ్చిన  కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. 

తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 17వ ర్యాంక్‌‌‌‌కు చేరుకున్న సుమీత్‌‌‌‌.. - మనూ అత్రితో కలిసి 2016 సౌత్ ఏషియన్ గేమ్స్‌‌‌‌లో గోల్డ్ మెడల్ సాధించాడు.  -రియో ఒలింపిక్స్‌‌‌‌లో పాల్గొనడంతో పాటు 2016, 2014, 2018 ఆసియన్ గేమ్స్‌‌‌‌లో ఇండియా టీమ్‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. - 2015 మెక్సికో సిటీ గ్రాండ్ ప్రి, 2016 కెనడా ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్నాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌ ఆరంభంలోనే సుమీత్‌‌‌‌ తీవ్రమైన వెన్నెముక సమస్యతో ఇబ్బంది పడ్డాడు. 

డాక్టర్లు బ్యాడ్మింటన్‌‌‌‌ను వదిలేయాలని లేదంటే నడుం కింది భాగం చచ్చుబడిపోతుందని హెచ్చరించినా సుమీత్ కెరీర్ కొనసాగించాడు. తోటి ప్లేయర్ సిక్కి రెడ్డిని పెండ్లి చేసుకున్న అతను 2021లో సిక్కి– సుమీత్ బ్యాడ్మింటన్ అకాడమీని హైదరాబాద్‌‌‌‌లో ప్రారంభించాడు. ప్రస్తుతం ఇండియా విమెన్స్‌‌‌‌ డబుల్స్ ప్లేయర్లకు కోచ్‌‌‌‌గా పనిచేస్తున్నాడు.