మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ( జనవరి 13) రామకృష్ణాపూర్ లో అయ్యప్ప స్వాములకు స్థానిక రామాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక హిందువులు, ముస్లిం సోదరులు కలిసి రామాలయంలో భోజనం చేశారు.
ఇదే తరహాలో శుక్రవారం (జనవరి 12) కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రంలో మత సామరస్యం వెల్లివిరిసింది. అయ్యప్ప స్వామి దీక్షాపరులు ఇరుముడి కట్టుకోని శబరిమలైకి వెళ్తుండగా ధర్మపురి అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కొడుమూరు ముస్లిం ల ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.