కమ్యూనిటీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లలో... కనిపించని సౌలత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

  •     నీళ్లు లేక కొన్ని, రిపేర్లు చేయక మరికొన్ని క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     ఎలుకలు, పందులు, కుక్కల స్వైరవిహారం
  •     ఇబ్బందులు పడుతున్న రోగులు, వారి బంధువులు

యాదాద్రి, వెలుగు : ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. యాదాద్రి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లో ఓ వైపు ఎలుకలు, కోతులు, కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో రోగుల బంధువుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు కనీసం టాయిలెట్లు కూడా సరిగా లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. 

అత్యవసరమైతే అవస్థే...

యాదాద్రి జిల్లా భువనగిరిలో జిల్లా హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా ఆలేరు, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రామన్నపేటలో కమ్యూనిటీ హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్లు ఉండగా, ఒక్కో సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 బెడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆలేరు, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు హైవేలపై ఉండడంతో యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులే ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ కనీసం టాయిలెట్లు కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు, వారి బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరులో మొత్తం 10 వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉండగా ఇందులో ఎనిమిదింటిని మూసివేశారు. చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు ఉండగా ఇందులో సగం క్లోజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. రిపేర్లు చేయక కొన్ని, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెసిలిటీ లేక మరికొన్ని టాయిలెట్లకు తాళాలు వేశారు. రోగుల తాకిడి ఎక్కువగా ఉండడం, టాయిలెట్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ఉన్న ఒకటి, రెండు టాయిలెట్ల నిర్వహణ కూడా సరిగా లేకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతున్నాయి. అలాగే సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీల్లో ఎలుకలు, కోతులు, పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తుండడంతో రోగులు, వారి బంధువులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మంత్రులొస్తేనే క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్రు

సాధారణ జనాల ఇబ్బందులను పట్టించుకోని ఆఫీసర్లు.. మంత్రులు పర్యటనకు వచ్చినపుడు మాత్రం అంతా బాగుందని అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆలేరు, చౌటుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలను ఇటీవల ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు పరిశీలించారు. ఆయన వచ్చిన రోజు రెండు హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అద్దంలా తయారు చేశారు. ఆయన వెళ్లిపోగానే మళ్లీ సేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. హాస్పిటళ్లలో శానిటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసుకున్న వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యహరించడం, ఆఫీసర్లు పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందని రోగులు అభిప్రాయపడుతున్నారు. ఆఫీసర్లు స్పందించి హాస్పిటళ్లలో వసతులు కల్పించాలని కోరుతున్నారు. 

ఆడవారికి, మగవారికి ఒకటే బాత్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

ఆలేరు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆడవారికి, మగవారికి కంబైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాత్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరొకరిని తోడు తీసుకొని టాయిలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సి వస్తోంది. ఆఫీసర్లు స్పందించి సమస్యను పరిష్కరించాలి. - రాములమ్మ, ఆలేరు