మదనాపురంలోని రైల్వే గేట్ లో టెక్నికల్ ప్రాబ్లం .. ఇబ్బంది పడిన ప్రయాణికులు

మదనాపురంలోని రైల్వే గేట్ లో టెక్నికల్  ప్రాబ్లం .. ఇబ్బంది పడిన ప్రయాణికులు

మదనాపురం, వెలుగు: మదనాపురంలోని రైల్వే లెవెల్  క్రాసింగ్  గేట్​లో మంగళవారం టెక్నికల్  ప్రాబ్లం రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వనపర్తి రోడ్​ రైల్వే స్టేషన్ కు రైళ్లు వచ్చిపోయే సమయంలో రైల్వే గేట్​ వేస్తారు. రైలు వెళ్లిన తర్వాత గేట్​ ఓపెన్  కాకపోవడంతో ఇబ్బందిపడాల్సి వచ్చింది.

 రోజుకు 15 సార్లు గేటు పడుతుండగా, ప్రతిసారి గేట్  లాక్​ ఓపెన్  కాకపోవడంతో 5 నుంచి 10 నిమిషాల వరకు గేట్ కు రెండువైపులా వాహనాలు నిలిచిపోతున్నాయి. 15 రోజులుగా ఈ సమస్య ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదని, రైల్వే అధికారులు స్పందించి రిపేర్  చేయించాలని కోరుతున్నారు .