కొందరికి కాంట్రాక్టు పద్ధతిలో
ప్రతి పదింటిలో రెండు కాంట్రాక్ట్ జాబ్సే!
కొన్ని దేశాల్లో సీఈవో షేరింగ్ మోడల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో ఇండియన్ కంపెనీల వర్క్ స్ట్రక్చర్ పూర్తిగా మారిపోతోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. పర్మనెంట్ ఉద్యోగులకు బదులు.. షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ల కోసం పార్ట్ టైమర్లను నియమించుకుంటున్నాయి. గిగ్ వర్కర్లకు బాగా డిమాండ్ పెరిగింది. నిర్దేశిత కాంట్రాక్ట్ సమయం వరకు కంపెనీలో పనిచేసే వారిని గిగ్‌వర్కర్లు అంటారు. కంపెనీలు మాత్రమే కాక, ఉద్యోగులు కూడా గిగ్ వర్కింగ్‌కే ఆసక్తి చూపుతున్నారు. క్లయింట్స్ ప్రాజెక్టుల కోసం పార్ట్ టైమ్ లేదా అడ్వయిజరీ బేసిస్‌లో ప్రొఫెషనల్స్‌ను తీసుకుంటున్నట్టు కన్సల్టింగ్ కంపెనీలు చెబుతున్నాయి. ఆరు నెలల నుంచి ఏడాది వరకు కంపెనీలో పనిచేసి బయటికి వస్తున్నట్టు లింక్‌డిన్ ఎంప్లాయీ–రెడీనెస్ సర్వేలో ఒక రెస్పాండెంట్ చెప్పారు. యూరప్‌లో అయితే సీఈవో షేరింగ్ మోడల్ నడుస్తోంది. అంటే ఒకటికి మించిన కంపెనీలో వీరు సీఈవోగా పనిచేస్తారు. అయితే ఈ రెండు కంపెనీలు కాంపిటీటర్లు కాకూడదు. ఇండియాలో ఇంకా సీఈవో షేరింగ్ మోడల్ రాలేదు.
ఎన్నోమార్పులు…
కరోనా మహమ్మారి తర్వాత కంపెనీల జాబ్స్ హైరింగ్ విధానాల్లో చాలా మార్పులు వచ్చాయి. డిజిటల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఎనలటిక్స్, సైబర్ సెక్యూరిటీలో టాలెంట్ ఉన్నవారికి డిమాండ్ ఉంది. ఖర్చులను తగ్గించుకునేందుకు గిగ్ ఎన్విరాన్‌మెంట్ వైపుకి కంపెనీలు మరలుతున్నాయి. ఇన్‌ఫ్రా, మేనేజిరియల్ ఖర్చులను కూడా కంపెనీలు ఆదా చేస్తున్నాయి. ఇండియా గిగ్ ఎకానమీ విలువ 3.4 బిలియన్ డాలర్లు వరకు ఉంటుంది. ప్రస్తుతం కంపెనీలు ఇస్తున్న ప్రతి పది ఉద్యోగాల్లో రెండు షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ లేనని ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ హ్యుమన్ రిసోర్సస్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్, లేబర్ ఎకనమిస్ట్ కేఆర్ శ్యామ్ సుందర్ తెలిపారు. ఈ మహమ్మారి గిగా ఎకానమీకి బలమైన గ్రోత్‌ను ఇచ్చిందని ఫ్లెక్సింగ్
ఇట్ ఫౌండర్, సీఈవో చంద్రిక తెలిపారు. వచ్చే కొన్ని నెలల్లో డిమాండ్, సప్లయిలో గ్రోత్‌ను చూస్తామన్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కొన్ని వర్కర్లను డైరెక్ట్ గా ప్రాజెక్ట్ కు కనెక్ట్ చేస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్స్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పార్టనర్ లుగా కంపెనీలకు కనెక్ట్ అయి, ప్రాజెక్టులను గిగ్ వర్కర్లకు ఇస్తాయి. అయితే ఇప్పటికీ 80 శాతం ఆర్గనైజ్డ్ సెక్టార్ జాబ్స్‌కు సెక్యూరిటీ ఉంటుందని శ్యామ్ సుందర్ తెలిపారు. ఇక నుంచి కంపెనీలు కోర్, నాన్ కోర్‌గా తమ స్టాఫ్‌ను విభజిస్తాయని కామ్‌పే సీఈవో, ఫౌండర్ రిషి ఖైని తెలిపారు.
డైరెక్ట్‌గా కంపెనీకే అప్లైచేయొచ్చు
అమెరికాలో ఈ ఏడాది డిసెంబర్ వరకు వర్క్ వీసాలను ఇవ్వడం ఆపేశారు. అక్కడ వీసా గడువు పూర్తయిన వాళ్లు ఇండియాకు వచ్చేయాలి. ఇండియా నుంచే అమెరికన్ కంపెనీల కోసం పనిచేసేలా కామ్ డాట్ వర్క్ అవకాశం కల్పిస్తోంది. ప్రపంచంలో ఏమూలన ఉన్న కంపెనీలోనైనా పనిచేసేలా కామ్ డాట్ వర్క్ జాబ్ పోర్టల్ ఉద్యోగులను హైర్ చేసుకుంటోంది. కంపెనీలు ఇండియన్ టాలెంట్‌ను ఇండిపెండెంట్‌గా హైర్ చేసుకుంటున్నాయి. అంతేకాక కామ్ డాట్ వర్క్ జాబ్ పోర్టల్ ఉద్యోగుల నియామకాల్లో మిడిల్ లేయర్‌ను తొలగిస్తోంది. ఓపెన్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తోంది. అంటే అభ్యర్థులు డైరెక్ట్ గా కంపెనీకి అప్లయి చేసుకోవచ్చు. చాలా కంపెనీలు కూడా సొంతగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వీరికి కొన్ని ప్రాజెక్టులు ఇచ్చి ఇంటినుంచే పనిచేయించుకుంటున్నాయని ఒక హైరింగ్ కన్సల్టెన్సీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు.
ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లుగా సీనియర్ ఉద్యోగులు..
సీనియర్ ఉద్యోగులు ఇండిపెండెంట్ కాంట్రాక్టర్లుగా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 50 ఏళ్లు దాటిన తర్వాత వారికి పర్మినెంట్ ఉద్యోగాలు రాకపోవడంతో కన్సల్టింగ్ లేదా గిగ్ రోల్స్‌లో పనిచేయాలని చూస్తున్నారు. సి–సూట్స్(సీటీవో,సీఎంఓ,సీఎఫ్‌ఓ)లు కూడా గిగ్ అసైన్‌మెంట్లకే ఆసక్తి చూపుతున్నారు. అంతేకాక డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ విధానాన్ని ఎంచుకుంటున్నారు. రెండు లేదా మూడు కంపెనీల్లో పనిచేస్తున్నారు. ‘ఆటోమొబైల్ సెక్టార్‌లో నేను ఒక కంపెనీకి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా పనిచేయవచ్చు. అలాగే హెల్త్‌కేర్ డొమైన్‌లో కూడా. ఈ రెండింటికి ఎలాంటి కనెక్షన్ లేదు. ఖర్చులు కూడా డివైడ్ అవుతాయి’అని కోహైర్ ఫౌండర్ వినీత్ ఆర్యా అన్నారు.
For More News..