చిప్​ల కొరతతో చిక్కులు

చిప్​ల కొరతతో చిక్కులు
  • చిప్​ల కొరతతో చిక్కులు
  • కార్డుల జారీకి ఇబ్బందులు
  • లైసెన్సుల జారీ ఆలస్యం
  • బండ్ల రిజిస్ట్రేషన్​కూ సమస్యలే
  • కరోనా వల్లే చిప్స్​ సప్లై తగ్గుదల

న్యూఢిల్లీ : సెమీకండక్టర్ చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కొరత వల్ల కంపెనీలతోపాటు జనమూ ఇబ్బందిపడుతున్నారు. వీటి సప్లై సరిగ్గా లేకపోవడంతో డ్రైవింగ్​ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఆటోమొబైల్ రిజిస్ట్రేషన్ కార్డులు, ఇతర స్మార్ట్​కార్డులు ఇవ్వడం కష్టమవుతోంది. కొత్తగా వెహికల్​ కొన్నవాళ్లు కార్డుల కోసం వేచి చూడాల్సి వస్తోంది.  సరఫరా గొలుసులో అంతరాయం,  రష్యా–-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కొరత ఏర్పడిందని, అందుకే స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్​లు తగినన్ని  ఇవ్వడం  లేదని వర్సటైల్ కార్డ్ టెక్నాలజీ (వీసీటీ) వన్  సీఈఓ పేతి సద్గురు తెలిపారు.  పాన్​ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  ఓటర్ ఐడీల కోసం ఉపయోగించే చిప్​లు కూడా తగినన్ని దొరకడం లేదని తెలిపారు. చాలా రాష్ట్రాల్లో ఈ స్మార్ట్ కార్డుల సప్లైకి టెండర్లు ఖరారు కాలేదు. మహారాష్ట్రలో, స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం టెండర్ మణిపాల్ టెక్నాలజీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంట్రాక్టు ఇచ్చారు. వీళ్ల తయారీ మొదలైతే రెండు లేదా మూడు నెలల్లో కొరత తగ్గుతుందని అక్కడ ప్రభుత్వం చెబుతోంది. పలు ఆర్థిక సంస్థలకు,  బ్యాంకులకు సెక్యూర్​ బేస్​డ్​ ప్రింటింగ్ సొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల ప్రొవైడర్ అయిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ హై–టెక్ ఛైర్మన్ & సీఈఓ  శ్రీనివాస్ రావు మాట్లాడుతూ, చాలా రాష్ట్రాల్లో డ్రైవర్ల లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల జారీ ఆలస్యమవుతోందని తెలిపారు. చిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కొరత వల్ల గత ఏడాది చివర్లో బ్యాంకులు తగినన్ని కార్డులను ప్రింట్​ చేయలేకపోయాయి. 

ప్రభుత్వం, ప్రైవేట్ ఏజెన్సీలు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మెరుగుపడింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వల్ల ఏర్పడ్డ అంతరాయాల వల్ల కార్డుల జారీ మరింత తగ్గింది. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఒక ఐటీ ఉద్యోగి మాట్లాడుతూ, తాను 2022 మధ్యలో తన కొత్త కారును కొన్నానని, దానికి స్మార్ట్ కార్డ్ ఇప్పటికీ అందలేదని చెప్పారు. డిజిలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాపీ లేదా పేపర్ ప్రింట్ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. కరోనా సమయంలో చిప్స్​ కోసం టెండర్లను ఖరారు చేయకపోవడంతో సమస్యలు వచ్చాయి. 2021–-2022లో కొత్త వెహికల్స్ విక్రయాలు విపరీతంగా పెరిగిపోవడంతో తగినన్ని కార్డులు ఇవ్వలేకపోయామని కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని మోటారు వెహికల్స్​ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  అయితే, డిజిలాకర్ రాకతో ట్రాఫిక్ సిబ్బంది నుంచి వేధింపుల సమస్య తగ్గిందని, దీని ద్వారా డౌన్​లోడ్​ చేసుకున్న కార్డులను చూపిస్తే చాలని అల్వార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ డీలర్ నికుంజ్ సంఘీ తెలిపారు. చిప్స్​కొరత ఇప్పట్లో తగ్గేలా లేదు కాబట్టి డిజిలాకర్​ డాక్యుమెంట్లతో సర్దుకుపోవాలని ప్రభుత్వవర్గాలు అంటున్నాయి. భారతదేశం డిజిటల్ ఎకోసిస్టమ్​ వైపు కదులుతోందని, స్మార్ట్​కార్డుల అవసరం ఉండబోదని రవాణాశాఖ అధికారి ఒకరు వివరించారు.

ALSO READ :రుణమాఫీ, వడ్ల పైసలపై నిలదీయండి: రేవంత్ రెడ్డి