
మోసపోయే వారు ఉన్నంతవరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇవ్వగలమో.. లేదో చెప్పడానికి క్రెడిట్ కార్డు ఎందుకు చెప్పండి. ఇది ఆన్‌లైన్‌లో విస్తృత చర్చకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్‌గా దీన్ని వర్ణిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఒక అభ్యర్థి జూనియర్ డేటా ఎంట్రీ క్లర్క్/పార్ట్-టైమ్ (రిమోట్) ఉద్యోగానికి లింక్డ్ఇన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. అతనికి ఓ కంపెనీ నుండి మెయిల్ వచ్చింది. దాంతో, మొదట ఎగిరి గంతేసిన మనోడు.. తీరా అందులోని మ్యాటర్ చదివాక ఆశ్చర్యపోయాడు. క్రెడిట్ కార్డు తీసుకుంటేనే ఇంటర్వ్యూకు రండి.. అని ఆ మెయిల్ సారాంశం.
ఉద్యోగ బాధ్యతలు వివరించిన ఆ మెయిల్‌లో క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన లింక్ కూడా పొందుపరిచారు. దరఖాస్తు చేసినట్లు ప్రూఫ్ వారికి పంపితే.. 48 గంటల్లోగా ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేస్తామని తెలిపారు. దరఖాస్తుదారులు వారి క్రెడిట్ స్కోర్ ప్రక్రియను పూర్తి చేసి, ఇమెయిల్‌కు రిప్లై ఇచ్చిన తర్వాతనే ఇంటర్వ్యూ సమయం షెడ్యూల్ చేయబడుతుందని నొక్కి చెప్పారు.
ALSO READ : పేరెంట్స్కు షాక్ ..ప్రైవేట్ స్కూల్ ఫీజులు 30 శాతం పెంచారు..
ఇది స్కామ్ అని తెలుసుకున్న అభ్యర్థి నిరుద్యోగులను హెచ్చరిస్తూ.. తన అనుభవాన్ని పంచుకున్నాడు. అందుకు సంబంధించిన ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌లను అభ్యర్థి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
Credit Card on file…. For an interview?
byu/CrayonConservation inrecruitinghell
నిరుద్యోగులకు అలెర్ట్..
ఏ కంపెనీ కూడా ఇంటర్వ్యూ కోసం అభ్యర్థిని క్రెడిట్ కార్డు అడగదు. దీన్ని గుర్తుంచుకోవాలి. ఆర్థిక పరమైన వివరాలు అడిగారంటే, అప్రమత్తం అవ్వాల్సిందే. అసలే ఈ కాలంలో ఏ పేరు చెప్పి.. ఏ మోసం చేస్తారో అంతు పట్టడం లేదు. నిజమని అవతలి మాటలు నమ్మారంటే, మీరు మోసపోయినట్లే.