వనభోజనాలు, క్యాంపింగ్ లాంటివాటికి వెళ్లినప్పుడు కోడిని పట్టుకెళ్తుంటారు. ఫెసిలిటీస్ ఏమీ లేని దగ్గర కోడిని కోసి, శుభ్రం చేయడం చాలా పెద్దపని. అలా బయటకు వెళ్లి, అక్కడే వండుకుని తినాలి అనుకున్నప్పుడుఈ ఎలక్ట్రిక్ పౌల్ట్రీ ప్లక్కర్‌ని వెంట తీసుకెళ్లాలి. దీంతో కోడి ఈకలని ఈజీగా తీసేయొచ్చు. ఎనాక్షి అనే కంపెనీ ఈ పౌల్ట్రీ ప్లక్కర్ను మార్కెట్లోకి తెచ్చింది.
దీన్ని వాడడం చాలా ఈజీ. కరెంట్‌కు ప్లగ్ చేసి ఆన్ చేసి.. ప్లక్కర్‌ని ఈకలకు దగ్గరగా పెట్టాలి. దీన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారుచేశారు. కాబట్టి చాలా రోజులు మన్నికగా ఉంటుంది. రెండు హై స్పీడ్ రొటేటింగ్ హెడ్‌లు వ్యతిరేక దిశల్లో తిరుగుతుంటాయి. వీటి మధ్య ఉండే టైట్నెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పోర్టబుల్ సైజులో ఉండడం వల్ల ఎక్కడికైనా తీసుకెళ్లడం ఈజీ.
ధర : 4,202 రూపాయలు
ఆనియన్ స్లయిసర్
కూరగాయల్ని కత్తితో కాకుండా ఇలాంటి స్లయిసర్లతో కోస్తే చాలా టైం సేవ్ అవుతుంది. ఈ స్లయిసర్కి ఆరు కత్తులు ఉంటాయి. కాబట్టి ఆరు నిమిషాల్లో చేసే పనిని ఒకే నిమిషంలో చేసేస్తుంది. ముఖ్యంగా ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, దోసకాయలు, క్యారెట్లు, టొమాటోలు, బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు, అల్లం, వెల్లుల్లి లాంటి వాటిని కట్ చేయడానికి బాగుంటుంది. దీన్ని మర్జి అండ్ అనుర్వుట్టి అనే కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ వెజిటబుల్ స్లయిసర్ తుప్పు పట్టదు.
ధర : 249 రూపాయలు
ఆలుగడ్డ కట్టర్
ఆలుచిప్స్ చేసుకోవడానికి ఆలుగడ్డలను ఎంత జాగ్రత్తపడినా అన్ని ముక్కలు ఒకే మందంలో కట్ కావు. ఈ కట్టర్ని స్పెషల్‌గా ఆలుగడ్డల కోసమే తయారుచేశారు. అయితే.. ఆలుగడ్డలతోపాటు క్యారెట్, ఉల్లిగడ్డ లాంటి వాటిని కూడా కట్ చేయొచ్చు. దీన్ని వ్రిజ్టి అనే కంపెనీ మార్కెట్లోకి తెచ్చింది. ఇందులో 30 కట్టింగ్ ఆప్షన్‌లు ఉన్నాయి. జూలియన్, డైస్, స్టయిస్ కట్టింగ్స్ చేయొచ్చు. పొట్టు తీసిన ఆలుగడ్డ ఇందులో పెట్టి ప్రెస్ చేస్తే చాలు. కింది భాగంలో ఉండే బాక్స్‌లో ముక్కలు పడిపోతాయి. పదునుగా ఉన్న స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉన్నాయి. తుప్పు పట్టదు. హ్యాండ్ గార్డ్, నాన్-స్లిప్ బేస్ ఉండడం వల్ల గాయాలు అయ్యే ప్రమాదం కూడా లేదు. దీన్ని ఫుడ్ గ్రేడ్ బీపీఏ ఫ్రీ మెటీరియల్‌తో తయారుచేశారు. క్లీన్ చేయడం చాలా ఈజీ. ఇది కిచెన్‌లో ఉంటే ఫుడ్ ప్రిపరేషన్ టైం50 శాతం తగ్గుతుంది.
ధర: 599 రూపాయలు
ఎల్పీజీ గ్యాస్
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు గ్యాస్ లీకేజీల వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గ్యాస్ లీకేజ్‌ని గుర్తించే ఇలాంటి డివైజ్ వాడితే కాస్త ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. దీన్ని జనరిక్ అనే కంపెనీ మార్కెట్లోక అమ్ముతోంది. గ్యాస్ లీకైనట్లు గుర్తించగానే గ్యాస్ సప్లైని ఆపేస్తుంది. ఇందులో ఉండే సెన్సిటివ్ సెన్సర్ ఎప్పటికప్పుడు గ్యాస్ లీకేజ్‌ను కనిపెడుతుంది. లీక్ అవుతుందని గుర్తించిన సెకన్లలోనే గ్యాస్ వాల్వ్‌ని ఆటోమెటిక్‌గా ఆపేస్తుంది. గ్యాస్ సిలిండర్‌కు, రెగ్యులేటర్‌కు మధ్యలో దీన్ని ఇన్స్టాల్ చేస్తే సరి.
ధర : 1,150 రూపాయలు