లాక్ డౌన్ కష్టాలు : డబ్బు కోసం మేనేజర్ ను ఆఫీస్ లో కట్టేసి చిత్రహింసలు చేసిన యజమాని

లాక్ డౌన్ కష్టాలు : డబ్బు కోసం మేనేజర్ ను ఆఫీస్ లో కట్టేసి చిత్రహింసలు చేసిన యజమాని

లాక్డౌన్ టైంలో కంపెనీ డబ్బులు ఖర్చుపెట్టాడంటూ.. ఉద్యోగిని కిడ్నాప్ చేసిన ఘటన పూణేలో జరిగింది. కోత్రుడ్లో పెయింటింగ్స్ ను ప్రదర్శించే ఒక కంపెనీకి చెందిన మేనేజర్.. విధుల్లో భాగంగా లాక్డౌన్ కు ముందు మార్చిలో ఢిల్లీ వెళ్లాడు. ఆయన అక్కడకు వెళ్లగానే.. లాక్డౌన్ ప్రకటించారు. దాంతో ఆ మేనేజర్ అక్కడే ఓ హోటళ్లో చిక్కుకుపోయాడు.

లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మే 7న ఆ మేనేజర్ పూణేకు తిరిగొచ్చాడు. రాగానే.. మరో 17 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని యజమాని చెప్పాడు. దాంతో మేనేజర్ పూణేలోని హోటళ్లో దిగాడు. మేనేజర్ 17 రోజుల తర్వాత హోటల్ గది ఖాళీచేసేటప్పుడు తన వద్ద డబ్బు లేకపోవడంతో ఫోన్ మరియు డెబిట్ కార్డును కుదవపెట్టి వెళ్లాడు.

కొన్ని రోజుల తర్వాత మేనేజర్ తాను పనిచేసే కంపెనీకి వెళ్లి యజమానిని కలిశాడు. ఆ యజమాని లాక్డౌన్ టైంలో కంపెనీ డబ్బు వాడుకున్నందుకు కోపగించుకొని.. ఆ డబ్బంతా కట్టాలని ఒత్తిడిచేశాడు. ఈ విషయంపై మేనేజర్ కు, యజమానికి కొన్ని రోజుల పాటు గొడవ జరిగింది. విసుగుచెందిన యజమాని.. జూన్ 13న మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి మేనేజర్ ను కొట్టి కిడ్నాప్ చేశాడు. లాక్డౌన్ కారణంగా మూతపడిఉన్న ఆఫీసులోనే మేనేజర్ ను బంధించాడు. ఖర్చుపెట్టిన డబ్బు తిరిగి చెల్లించాలని కొడుతూ.. శానిటైజర్ ను మేనేజర్ మర్మాంగలపై పోశాడు. ఆ తర్వాత మేనేజర్ ను జూన్ 14న విడుదలచేశారు. ఈ ఘటన జూన్ 13న జరిగితే.. మేనేజర్ జూలై 2న తన యజమానిపై పౌడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

For More News..

గాలి ద్వారా కరోనావైరస్.. ఆధారాలున్నాయంటున్న సైంటిస్టులు

రోజూ 24 కి.మి. సైకిల్‌‌పై బడికి.. టెన్త్‌‌లో టాప్‌‌ సాధించిన రైతు బిడ్డ

పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..