
దేనికైనా ఓ హద్దు ఉంటుంది.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఇదేమీ మన సొంత కంపెనీ కాదు.. వ్యాపారం అంతకన్నా కాదు కదా.. సో.. పరిస్థితులకు తగ్గట్టు బతికేయాలి అంటారు పెద్దలు.. ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు ట్రెండ్ మారింది. జనరేషన్ జెడ్ వచ్చేసింది.. మీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, మాకు ఉన్నాయి.. మాకు ఉద్యోగం కంటే ఫ్యామిలీ ముఖ్యం.. నా ఇష్టం వచ్చినప్పుడు ఆఫీసుకు వస్తా.. నీకు ఇష్టం లేకపోతే చెప్పు మానేస్తా.. వర్క్ ఫ్రం హోం ఇస్తే ఉంటా.. లేకపోతే వెళ్లిపోతా ఇలాంటి డైలాగ్స్ ఈ కాలం జనరేషన్ జెడ్ ఉద్యోగుల్లో బాగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అందుకు తగ్గట్టే కనిపిస్తున్నాయి.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోనేందుకు ఇప్పుడు కంపెనీలు కొత్త తరహా వ్యూహంలోకి వచ్చాయి.. దాన్ని అమలు చేసిన ఓ ఐటీ కంపెనీ.. ఇప్పుడు ఇంటర్నెట్ ట్రెండింగ్ అయ్యింది.. వైరల్ అయ్యింది.. ఐటీ ఉద్యోగుల్లో కొత్త గుబులు పుట్టించింది.
వర్క్ తగ్గిస్తాం.. జీతం కూడా తగ్గిస్తాం.. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో ఎక్కు సమయం గడపండి అంటూ ఓ కంపెనీ నుండి వచ్చిన మెయిల్ నెట్టింట వైరల్ గా మారింది. సదరు ఉద్యోగి పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఈ ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం చూసుకోవడం బెటర్ అని కొంతమంది కామెంట్ చేయగా.. లేఆఫ్ నోటిస్ కంటే ఇది కాస్త బెటర్ అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. తీసేయడానికి ఇది ఒక సంకేతమని మరొక నెటిజన్ కామెంట్ చేసారు. కంపెనీ ఐడియాకు కౌంటర్ గా మరో నెటిజన్ " మేము కూడా మా వర్క్ ని 100శాతం తగ్గించి జాబ్ సర్చ్ పై ఫోకస్ పెడతామని కామెంట్ చేశారు.
అసలే లేఆఫ్స్ తో బెంబేలెత్తుతున్న ఐటీ ఎంప్లాయిస్ కి ఇప్పుడు ఇంకొక టెన్షన్ వచ్చి పడిందనే చెప్పాలి. ఈ కంపెనీ తరహాలోనే మిగిలిన కంపెనీలు కూడా ఆలోచిస్తే.. ఇక ఐటీ ఎంప్లాయిస్ కి గడ్డురోజులు తప్పవని చెప్పాలి. పేరుకు వర్క్ ప్రమ్ హోమ్ చేస్తున్నాం కానీ.. రోజుకు 12 గంటల వరకు పనిచేయాల్సి వస్తుందని.. చాలామంది ఐటీ ఎంప్లాయిస్ వాపోతున్నారు.ఇక ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే జీతం తగ్గిస్తామంటూ కంపెనీలు కొత్త రూల్స్ తెస్తే ఉద్యోగుల పరిస్థితి ఏమవుతుందో చూడాలి.