టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక్క ఐటీ రంగంలోనే కాదు.. హెల్త్ కేర్ రంగంలో కూడా అడ్వాన్స్ డ్ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఎన్నో ప్రాణాంతక రోగా లను సైతం నయం చేసే కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. భవిష్యత్తుల్లో ముసలినతనానికి చెక్ పెట్టడం కూడా సాధ్యం కావచ్చంటున్నారు. చనిపోయిన మని షిని కూడా బతికించే టెక్నాలజీ వస్తుంది బలంగా నమ్ముతోంది. అమెరికాకు చెందిన ఆల్కోర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ అనే కంపెనీ టాప్ క్రయోనిక్స్ కంపెనీగా ఉంది. ప్రాణాలపోయిన వారిని సైతం బతికించవచ్చనే ఉద్దేశ్యంతో ఈ సంస్థ శవాలను ప్రిజర్వ్ చేస్తోందట.. వివరాల్లోకి వెళితే..
వినేవారికి ఇది ఓ ఫాంటసీలా అనిపించొచ్చు. ఇది సాధ్యమేనా అని అనుకోవచ్చు. కానీ ఆల్కోర్ ఇప్పటికే 233 మంది మృతదేహాలను సేఫ్ భద్రపరిచిందట. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన రోజున వారిని తిరిగి బతికించాలనే ఆశలో ఉందట.
ఆల్కోర్ ఎలా పనిచేస్తుంది?
ఆల్కోర్ ఉపయోగించే శాస్త్రాన్ని “క్రయోనిక్స్” అంటారు. ఈ ప్రక్రియలో మానవ శరీరాలను చాలా చల్లని, చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తారు. భవిష్యత్తులో మెడికల్ ఫీల్డ్ చాలా అభివృద్ధి చెంది, ఈ శరీరాలను మళ్లీ బతికిస్తుందని కంపెనీ భావిస్తోంది. అలాగే ఏ వ్యాధులతో మరణించారో ఆ వ్యాధులకు చికిత్స అందించి, వారు ఎక్కువ కాలం జీవించేలా భవిష్యత్తు టెక్నాలజీ డెవలప్ అవుతుందని ఆశపడుతోంది.
Also Read:వర్షపు నీరు తాగొచ్చా.. తాగితే ఏమవుతుందో తెలుసా..
ఈ అడ్వాన్స్‌డ్ ప్రొసీజర్‌ను “విట్రిఫికేషన్” అంటారు. ఈ ప్రక్రియలో, శరీరంలోని రక్తాన్ని మొదట “క్రయోప్రొటెక్టెంట్” అనే ద్రావణంతో రీప్లేస్ చేస్తారు. ఇది లోపల మంచు స్ఫటికాలు ఏర్పడకుండా కాపాడుతుంది, ఎందుకంటే అవి కణాలు, కణజాలాలకు నష్టం కలిగిస్తాయి. విట్రిఫికేషన్ పూర్తయిన తర్వాత, శరీరాన్ని నెమ్మదిగా -196 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబరుస్తారు. లిక్విడ్ నైట్రోజన్‌తో నిండిన ఒక వాక్యూమ్ ఇన్సులేటెడ్ మెటల్ కంటైనర్‌లో నిల్వ చేస్తారు.
ఇది సాధ్యమేనా?
భవిష్యత్తులో వైద్య శాస్త్రం అంతగా అభివృద్ధి చెందుతుందా అనేది బిగ్ క్వశ్చన్. క్రియోప్రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా శరీరానికి కలిగే నష్టాన్ని, మరణానికి కారణమైన వ్యాధులను కూడా నయం చేయగలదా? అంటే అదీ ప్రశ్నార్థకమే. ప్రస్తుత మెడికల్ సైన్స్ అంతగా అభివృద్ధి చెందలేదు. భవిష్యత్తులో నానో-టెక్నాలజీ, రివైవల్ మెడికల్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశముంటుందని సదరు కంపెనీ కోరుకుంటోంది.
క్రియోప్రిజర్వేషన్ వల్ల కలిగే నష్టాన్ని రిపేర్ చేయగల స్థాయికి ఫ్యూచర్ మెడికల్ టెక్నాలజీ చేరుకోవచ్చని రాజ్‌కోట్‌లోని ఎయిమ్స్ అనాటమీ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. గ్యారెంటీ లేకపోయినా ఒక చిన్న హోప్‌తో ఆల్కోర్ సంస్థ బాడీలను రిజర్వ్ చేస్తోంది.
క్రియోప్రెజర్వేషన్ కోసం మెంబర్‌షిప్ తీసుకున్న వారి డబ్బులో ఒక భాగం ఈ ట్రస్ట్ ఫండ్‌కు వెళుతుంది. ఫుల్ బాడీ ప్రిజర్వేషన్‌కు, 115,000 డాలర్లు (దాదాపు రూ.96 లక్షలు)ఈ ట్రస్ట్‌కు చెల్లిస్తారు. మెదడు మాత్రమే కుళ్లిపోకుండా కాపాడాలంటే (న్యూరో ప్రిజర్వేషన్) 25,000 డాలర్లు (సుమారు రూ.21 లక్షలు) చెల్లిస్తారు. ఆల్కోర్ మెంబర్‌షిప్ కూడా అవసరం. వయస్సును బట్టి, ప్రతి నెలా 17-100 డాలర్ల మధ్య సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. పిల్లలను కూడా ఈ ప్రక్రియలో భాగం చేయాలనుకుంటే, ప్రతి బిడ్డకు ప్రతి సంవత్సరం 60 డాలర్లు ఎక్స్‌ట్రాగా చెల్లించాలి.
అయితే గడ్డకట్టిన టిష్యూల పాడయ్యే అవకాశం ఉంటుందని, వాటిని తిరిగే యథాస్థితికి తీసుకురావడం కష్టమని అనుమానాలు వ్యక్తం చేశారు. చనిపోయిన వారి పర్సనాలిటీ, మెమొరీస్, ఐడెంటిటీని ఎలా రీస్టోర్ చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.