గంగాధర, బోయినిపల్లి, వెలుగు: నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామం మంగపేటకు రూ.16.50కోట్ల పరిహారం మంజూరైనట్లు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. బుధవారం బూరుగుపల్లిలోని తన నివాసంలో పరిహారం చెక్కులను ముంపు బాధితులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో మండలానికి చెందిన సుమారు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్‌లో చేరారు.
ALSO READ:గృహలక్ష్మి లబ్ధిదారులను ఎంపిక చేయాలి: వల్లూరు క్రాంతి
రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాకలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమ, బీఆర్ఎస్ లీడర్రవీందర్ రావు, మండల అధ్యక్షుడు కొండయ్య పాల్గొన్నారు.