కొడంగల్, వెలుగు: వికారాబాద్జిల్లా దుద్యాల మండలంలో ఇండస్ట్రియల్ కారిడార్కింద భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగం, స్థలం ఇస్తామని కలెక్టర్ప్రతీక్జైన్హామీ ఇచ్చారు. కలెక్టరేట్లో సోమవారం దుద్యాల మండలం హకీంపేటరైతులతో ఆయన సమావేశమయ్యారు. 218 మంది రైతులకు సంబంధించి హకీంపేటలో మొత్తం 351 ఎకరాల భూమి ఉందని, దీనిపై రైతులతో చర్చించగా భూములు ఇచ్చేందుకు అంగీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.
సమ్మతి అవార్డు పొందిన రైతులకు ఒకే దఫాలో చెక్కుల ద్వారా నష్ట పరిహారాన్ని చెల్లిస్తామన్నారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా రైతులకు ఎకరానికి రూ. 20 లక్షలు, 150 గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, అర్హత మేరకు ఉద్యోగం కల్పించనున్నట్లు వివరించారు.
సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, టీజీఐఐసీ జోనల్ మేనేజర్ శారద, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా, దుద్యాల తహసీల్దార్ కిషన్ ఉన్నారు.