బీఆర్ఎస్ ను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం : మహారాష్ట్ర రైతులు

బీఆర్ఎస్ ను రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వం  : మహారాష్ట్ర రైతులు

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కోల్పోయిన తమ భూములకు పరిహారం చెల్లించేవరకు బీఆర్ఎస్ ను మహారాష్ట్రలో అడుగు పెట్టనివ్వబోమని  గడ్చిరోలి జిల్లా సిరంచా రైతులు హెచ్చరించారు. తమకు పరిహారం చెల్లించేలా చూడాలని స్థానిక  తహసీల్దార్​ కు వినతి పత్రం అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కారణంగా తమ భూములు నీట మునిగిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం సర్వేల పేరుతో తాత్సారం చేస్తూ పరిహారం చెల్లించడం లేదని మండిపడ్డారు. ముంపు బాధితులను పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతులను ఉద్దరిస్తామని గొప్పలు చెప్పుకోవడం ఏంటని ప్రశ్నించారు. ముంపునకు గురవుతున్న 135 ఎకరాలను సర్వే చేసి ల్యాండ్ యాక్టివేషన్ చేసుకొని ఇప్పటి వరకు వాటికి పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. 60 రోజులు నిరాహార దీక్ష చేసినా తమ వైపు కనీసం కన్నెత్తి చూడలేదని వాపోయారు. ఇలాంటి దాగాకోరు పార్టీని మహారాష్ట్రలోకి రానివ్వమని రైతులు తేల్చి చెప్పారు.