ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి

తుంగతుర్తి, వెలుగు: వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25 వేల  నష్టపరిహారం చెల్లించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మామిడి డేవిడ్ కుమార్ డిమాండ్‌‌‌‌ చేశారు.  ఆదివారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సర్కారు  ఎస్సారెస్పీ నీటిని వారబంధి పద్ధతిలో ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మండిపడ్డారు.  వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పంట పొలాలను పరిశీలించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంట నాగయ్య, బొడ్డు శంకర్ కిరణ్, మధు, కాశయ్య, సుధాకర్ రెడ్డి లింగయ్య, ఉప్పలయ్య  పాల్గొన్నారు.