పులి దాడి బాధితులకు  పరిహారం అందజేత : ఎఫ్ఆర్ ఓ వేణు గోపాల్

కుంటాల, వెలుగు  : కుంటాల మండలం లోని అంబుగాం అటవీ ప్రాంతంలో గత రెండు నెలల క్రితం పెద్ద పులి దాడి లో రెండు పశువులు మృతి చెందాయి. శుక్రవారం బాధిత రైతులు రాథోడ్ వినోద్ రూ.15 వేలు, గోరేకర్ మారుతీ కి రూ.10 వేల నష్టపరిహారం చెక్కులను బైంసా  ఎఫ్ఆర్ ఓ వేణు గోపాల్ అందజేశారు. ప్రస్తుతం కుంటాల మండలం లో పెద్ద పులి సంచారం లేదని, చిరుత పులుల సంచారం ఉందని ఆయన తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ ఎస్ ఓ లు కీర్తి, సంధ్య, బీ ట్ ఆఫీసర్లు  హరిలత, లెనిన్, కృష్ణ, మహేశ్వ ర్ తదితరులు పాల్గొన్నారు.

కాగ జ్ నగర్ : పులి సంచారం పై ప్రజలు , రైతులు జాగ్రత్తగా ఉండాలని, పులి దాడిలో మరణించిన పశువులకు వెంటనే పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు కాగ జ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ బోబడే సుశాంత్ సుఖ్దేవ్  అన్నారు. ఇటీవల  చీలపల్లి గ్రామానికి చెందిన గంగుల శంకర్ కి చెందిన ఆవు పులి దాడిలో మృతి చెందగా అతనికి రూ.  8వేల  నష్టపరిహారం  చెక్కును శుక్రవారం డివిజన్ ఆఫీస్ లో అందజేశారు. వన్యప్రాణులకు నష్టం చేసేలా ఎవరూ ప్రయత్నించవద్దని కోరారు. ఆయనతో పాటు కాగ జ్ నగర్ ఇంచార్జి రేంజ్ ఆఫీసర్ శశిధర్ బాబు ఉన్నారు.