- నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలకు మునిగిన ప్రతి ఒక్క ఎకరాకూ నష్ట పరిహారం ఇచ్చి.. నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లక్షల ఎకరాల్లో పంట మునిగితే, వేల ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. 4.15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డినే చెప్పారని, మరి వేల ఎకరాలకే నష్టపరిహారం ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.10వేలు.. పొలాలు బాగు చేసేందుకు కూడా సరిపోవని కేటీఆర్ పేర్కొన్నారు.