కొడంగల్, వెలుగు: అసైన్డ్ భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని కొడంగల్ ఆర్డీవో శ్రీనివాస్, కడా(కొడంగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తెలిపారు.
గురువారం కొడంగల్ తహసీల్దార్ ఆఫీసులో మండలంలోని అప్పాయిపల్లి గ్రామ రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ సెగ్మెంట్ అభివృద్ధికి సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.