రైతులు నష్టపోకుండా చూస్తాం :  మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు

జనగామ అర్బన్, వెలుగు : రైతులు, కౌలు రైతులు నష్టపోకుండా పరిహారం అందిస్తామని పంచాయతీ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల కు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆ దేశించారు. అకాల వర్షాలు, పంట నష్టం, వడ్ల కొ నుగోలు కేంద్రాలకు సంబంధించి అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు.

ఆయన మాట్లాడుతూ దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసి రిపోర్టు ప్రభుత్వానికి పంపాలని సూచించారు. మక్కలను కూడా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. శిథిలావస్థకు చేరిన విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్తంభాలను తొలగించి కొత్తవి నాటాలని సూచించారు. అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెవెన్యూ ఆఫీసర్లు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. రివ్యూలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివలింగయ్య, జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాగాల సంపత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోకల జమున, మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్దె సిద్దిలింగం, డీఆర్డీవో పీడీ రాంరెడ్డి, ఆర్డీవో కృష్ణవేణి, డీఏవో వినోద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీపీవో ఇస్మాయిల్, డీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రోజారాణి, డీఎం సంధ్యారాణి పాల్గొన్నారు. 

రజకుల సంక్షేమానికి కృషి


జనగామ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర మహాసభలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రజకుల అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మేడిపల్లిలో 2 ఎకరాల స్థలంలో రూ. 5 కోట్లతో ఐలమ్మ స్మారక భవనం నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పైళ్ల ఆశయ్య, గట్టేశం, ఉల్లెంగుల వెంకటేశం, ఉల్లెంగుల నర్సింగ్, కొలిపాక నర్సింహ, శ్రీనివాస్, ఉల్లెంగుల కృష్ణ పాల్గొన్నారు.

మంత్రికి హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శోభాయాత్ర ఆహ్వానపత్రం అందజేత

తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా తొర్రూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మే 14న నిర్వహించనున్న వీర హనుమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శోభాయాత్రకు హాజరుకావాలని కోరుతూ కమిటీ సభ్యులు మంత్రి ఎర్రబెల్లిని కోరారు. శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మినిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారి లో  కొలుపుల శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుదారపు పృథ్వీ, అనుమాండ్ల ప్రదీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, శివ, దేవరకొండ కృష్ణ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.