పొటీ పరీక్షల ప్రత్యేకం.. ప్రభుత్వరంగ పరిశ్రమలు

  • దేశంలో తొలి బీహెచ్ఈఎల్​ను 1956లో స్థాపించారు. 
  •  తెలంగాణ రాష్ట్రంలో బీహెచ్ఈఎల్​ను1963లో స్థాపించారు.
  • తెలంగాణ రాష్ట్రంలో రామచంద్రాపురం ప్రాంతంలో బీహెచ్ఈఎల్​ను స్థాపించారు.
  • ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ను 1967లో స్థాపించారు.
  • తెలంగాణ రాష్ట్రంలోని ఏఎస్​రావు నగర్ ప్రాంతంలో ఈసీఐఎల్​ను స్థాపించారు.
  • ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కోసం కోచ్​లను భారత్ ఎర్త్ మూవర్స్ తయారు చేస్తోంది.
  • తెలంగాణలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్​ను1961లో స్థాపించారు. 
  • హైదరాబాద్​లోని ఐడీపీఎల్​లో సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తారు.
  • ఐడీపీఎల్​ను తెలంగాణలోని బాలానగర్ ప్రాంతంలో స్థాపించారు.
  • ఔషధ తయారీలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
  • ఆసియాలో అతిపెద్ద యాంటీబయోటిక్స్ తయారీ కేంద్రం రిషికేష్  ప్రాంతంలో ఉంది.
  • దేశంలో మొదటి ఔషధ తయారీ పరిశ్రమ పింప్రిలో స్థాపించారు.
  • హైదరాబాద్​లో రెడ్డీస్ ల్యాబోరేటరీని 1984లో స్థాపించారు.
  • జీనోమ్ వ్యాలీ బాచుపల్లి ప్రాంతంలో ఉంది.
  •  శాంతాబయోటెక్ 1993లో స్థాపించారు.
  • భారతదేశంలో అతిపెద్దది, ప్రపంచంలో మొదటి బయోటెక్ పార్క్​ సమూహ జీనోమ్ వ్యాలీ.
  • అప్పెరల్ పార్క్ గుండ్లపోచంపల్లి ప్రాంతంలో ఉంది.
  • సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్​పూర్ ​ప్రాంతంలో మెడికల్ డివైజెస్ పార్క్ ఉంది.
  • హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ హైదరాబాద్, రూప్ నారాయణ్​ ప్రాంతంలో ఉంది.
  • హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్​ను1964లో స్థాపించారు.
  • హెచ్ఏఎల్​ను హైదరాబాద్​లోని బాలానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
  • హైదరాబాద్​లోని  హెచ్ఏఎల్​లో విమానాలకు సంబంధించి విడిభాగాలు మిగ్ విమానాల ఎలక్ట్రిక్ పరికరాలు తయారవుతాయి. 
  • హైదరాబాద్​లో మిశ్రమ ధాతు నిగమ్ లిమిటెడ్​ను 1973లో స్థాపించారు.
  • రిఫ్రిజరేటర్లు, బ్యాలెట్ బాక్సులు, బస్సుబాడీలు అల్విన్ పరిశ్రమలో తయారవుతాయి.
  • గ్యాస్ సిలిండర్లు ఎలక్ట్రోలక్స్ పరిశ్రమలో తయారవుతాయి.
  • తెలంగాణలోని భారజల కేంద్రాన్ని మణుగూరులో ఏర్పాటు చేశారు.
  • న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్ ప్రాంతంలో ఉంది.
  • రంగారెడ్డి జిల్లా కందుకూరు ప్రాంతంలో ప్రపంచస్థాయి ఫార్మాసిటీని ఏర్పాటు చేయనున్నారు.
  • నిర్మల్ పెయింటింగ్స్, టాయ్స్ పరిశ్రమ 1955లో ఏర్పడింది.
  • నిర్మల్ పెయింటింగ్స్, టాయ్స్ తయారీలో పునికి కలపను వాడుతారు.
  • దమ్ముగూడెం ప్రాంతం లేసుల తయారీ పరిశ్రమకు ప్రఖ్యాతిగాంచింది.
  • డోక్రామెటల్ క్రాప్ట్స్ కు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలు ప్రసిద్ధి.
  • డోక్రామెటల్ క్రాప్ట్స్ తయారీలో ఎర్రమట్టి, మైనం, ఇత్తడి ఉపయోగిస్తారు.
  • తెలంగాణలో ముత్యాల ఉత్పత్తికి చందంపేట ప్రాంతం ప్రసిద్ధి.
  • తివాచీలకు వరంగల్ జిల్లాలోని కొత్తగూడ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
  • సిల్వర్ ఫిలిగ్రికి కరీంనగర్ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది.
  • పెంబర్తి ఇత్తడి కళకు ప్రసిద్ధి.
  • గొల్లభామ చీరలకు సిద్దిపేట ప్రాంతం ప్రసిద్ధి.
  • సిద్దిపేట గొల్లభామ వస్త్రాలకు 2012లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. 
  • గద్వాల్ చీరలకు 2011లో భౌగోళిక గుర్తింపు వచ్చింది.
  • పోచంపల్లి ఇక్కత్ చీరలను 1956లో మొదటిసారిగా కర్నాటి అనంతరాములు ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.
  • తుంగ చాపలకు మహబూబ్​ నగర్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.
  • అగరవత్తుల ఉత్పత్తికి హైదరాబాద్ ప్రాంతం ప్రసిద్ధి చెందింది.