స్మితా సబర్వాల్​పై చర్యలు తీసుకోండి బండి సంజయ్​కు ఫిర్యాదు

  •  కేంద్ర మంత్రి బండి సంజయ్​కు కొల్లి నాగేశ్వర్ రావు ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు: వికలాంగులను కించపరిచేలా కామెంట్లు చేసిన ఐఏఎస్ ఆఫీసర్​ స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను కలిసి కంప్లైంట్ చేశారు. 

వికలాంగుల ఆత్మస్థైర్యాన్ని, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా స్మితా సబర్వాల్ ట్విట్లు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగుల హక్కుల చట్టం– 2016 , సెక్షన్ 92 ప్రకారం కేసు నమోదు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు.