ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డిపై ఫిర్యాదు

హుజూరాబాద్,​ వెలుగు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్​ రెడ్డితో తనకు ప్రాణభయముదని హుజూరాబాద్​పోలీస్​ స్టేషన్​లో శుక్రవారం ఫిర్యాదు చేసినట్లు ఓ యూట్యూబ్ ఛానల్​కెమెరామెన్ అజయ్​తెలిపాడు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం పాడి కౌశిక్​రెడ్డిని పలువురు మహిళలు నిలదీయగా, తాను వీడియో తీసినట్టు చెప్పాడు. దీంతో కౌశిక్​ అనుచరులు తన మొబైల్, కెమెరా లాక్కొని వెంట తిప్పించుకున్నారన్నారు.

ఎంత బతిమిలాడినా ఇవ్వకపోగా బెదిరించారన్నారు. తర్వాత తాను ఎమ్మెల్సీ ఇంటికి వెళ్తే బూతులు తిడుతూ రూంలోకి తీసుకువెళ్లి కడుపులో తన్నారన్నారు.  బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామని హెచ్చరించారన్నారు. పైగా తనపైనే కేసులు పెట్టిస్తానని, తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడని చెప్పాడు. ఈ విషయమై సీఐ రమేశ్​ను వివరణ కోరగా ఫిర్యాదు అందిన మాట వాస్తవమేనని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.