శామీర్​పేట సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

శామీర్​పేట సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా శామీర్ పేట సీఐ శ్రీనాథ్​పై ఓ వ్యక్తి హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. పాతకక్షలతో ఓ వ్యక్తి తనతోపాటు కుటుంబంపై తరచూ దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా తిరిగి తననే బెదిరిస్తున్నాడని ఆరోపించారు. 

బాధితుడి వివరాల ప్రకారం.. శామీర్​పేటకు చెందిన వరికుప్పల విజేందర్ అదే గ్రామానికి చెందిన దండుగుల మైసయ్యపై గత డిసెంబర్ 27న ఫిర్యాదు చేశాడు. అనుచరులతో తన ఇంటికి వచ్చి తన కుటుంబసభ్యులను కాళ్లతో తన్ని, అసభ్యపదజాలంతో దూషించాడని సీఐ శ్రీనాథ్​కు ఫిర్యాదు చేశాడు. 

అయితే, నిందితులపై ఎస్ఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మొదట కంప్లైంట్ చేసిన తనపైనే తిరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేశాడని హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశాడు. బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించి, తన కుటుంబాన్ని రక్షణ కల్పించాలని కోరాడు.