మైవిలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ చిక్కుల్లో పడ్డారు. గంగవ్వతో పాటు యూట్యూబర్ రాజు పై అటవీశాఖ అధికారులు, వైల్డ్ లైఫ్ కింద జగిత్యాల ఎఫ్.ఆర్. ఓ. పద్మారావు కేసు నమోదు చేశారు. 2022 సంవత్సరం మే నెలలో తీసిన ఓ వీడియోలో చిలుకను ఉపయోగించడంపై వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ పద్మారావు తెలిపారు.
యూట్యూబ్ ప్రయోజనాల కోసం చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదు చెయ్యడంతో జంతు సంరక్షణ కార్యకర్త గౌతమ్ ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లుగా ఎఫ్ఆర్ఓ తెలిపారు. దీంతో యూట్యూబర్ రాజు 25వేల రూపాయల ఫైన్ కట్టారు.బిగ్ బాస్ గంగవ్వపై కేసు నమోదు.
ALSO READ | Bigg Boss: షాక్.. హౌస్ నుంచి వెళ్లిపోతానన్న మాజీ కంటెస్టెంట్.. డోర్ తెరిచిన బిగ్‍బాస్
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం గంగవ్వ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానెల్ అయిన స్టార్ మాలో ప్రసారం అవుతున్న తెలుగు బిగ్ బాస్ 8 వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. గతంలో 4 వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకోగా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది.