- ఖమ్మం టూ టౌన్ పీఎస్ లో బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు
ఖమ్మం టౌన్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిపై ఖమ్మం టూ టౌన్ పీఎస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ఫిర్యాదు చేశాడు. ఆ పార్టీ నేతలతో కలిసి సీఐ బాలకృష్ణకు శనివారం రాత్రి కంప్లైంట్ చేశారు. తమ అధినేత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండబాల కోటేశ్వరరావు, పగడాల నాగరాజు, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, మాజీ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు మాధంశెట్టి హరిప్రసాద్ ఉన్నారు.