హైదరాబాద్ లోని ఫిలిం నగర్ దక్కన్ హోటల్ కూల్చివేతకు సంబంధించి బాధితుడు నంద కుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. దీంతో ఈ కేసుని నాంపల్లి కోర్టు విచారించింది. ఇందులోభాగంగా పెండింగ్ లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్నహైకోర్టు ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాకిచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే 2022 నవంబరులో జిహెచ్ ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు నందకుమార్ అప్పట్లో ఈ విషయంపై కోర్టుని ఆశ్రయించాడు. దీంతో కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో హోటల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికి దగ్గుబాటి కుటుంబ సభ్యులు కోర్ట్ ఆర్డర్స్ లెక్కచెయ్యకుండా 2024 జనవరిలో దక్కన్ హోటల్ ను దగ్గుబాటి కుటుంబం దౌర్జన్యంతో పూర్తిగా కూల్చి వేశారు.
దీంతో మరోసారి తనకి న్యాయం చెయ్యాలంటూ నందకుమార్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. ఈ కేసుని విచారించిన కోర్టు హోటల్ విషయంలో హైకోర్టు ఆర్డర్స్ లెక్కచెయ్యని దగ్గుబాటి కుటుంబంలోని వెంకటేష్, సురేష్ బాబు, రానా, అభిరామ్ తదితరులపై కేసు నమోదు చెయ్యాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసుని మరింత క్షుణ్ణంగా విచారించాలని ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశించింది. దీంతో ఈ విషయం టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తోంది.