రఘువరన్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి శరణ్య పొన్వన్నన్. తన ఫ్యామిలీతో చెన్నై సమీపంలోని విరుగంబాక్కంలో ఉంటున్న ఆమెపై తాజాగా ఓ కేసు నమోదైంది. పొరుగింటిలో ఉంటున్న శ్రీదేవి అనే మహిళతో శరణ్యకు పార్కింగ్ విషయంలో గొడవ జరిగి కొట్టుకునేవరకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈక్రమంలోనే ఆమె సదరు మహిళను చంపేస్తానంటూ బెదిరించారట. దీంతో శరణ్యపై పొరుగింటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. జరిగిన గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సాక్ష్యంగా సమర్పించింది.సినిమాల్లో మంచి పాత్రలతో పాపులర్ అయిన నటి శరణ్య పొన్వన్నన్ తన పొరుగువారితో గొడవకు దిగడం అభిమానులను షాక్‌కు గురి చేసింది.
కారు పార్కింగ్ గొడవ విషయంలో ఇటీవల కోలీవుడ్‌లో సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. హరీష్ కళ్యాణ్, ఎంఎస్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇద్దరు అద్దెదారుల తమ కారు పార్కింగ్ విషయంలో ఎంత దూరం వెళ్లారనే కథ ఆధారంగా ఈ చిత్రం రూపోంది మంచి విజయాన్ని అందుకుంది.