పోలీసులు వేధిస్తున్నారని హైకోర్టులో ఫిర్యాదు

పద్మారావునగర్, వెలుగు: చిలకలగూడ పోలీసులు వేధిస్తున్నారని పద్మారావు నగర్ చెందిన వ్యాపారి హైకోర్టును ఆశ్రయించాడు.  ఆదివారం పద్మారావునగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాధితుడు పాతూరి ధర్మేందర్​ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్​ 25న చిలకలగూడ ఏసీపీ జైపాల్​ రెడ్డి తనను స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలిపించి, తన పాత వ్యాపారంలోని నలుగురు భాగస్వాముల సమక్షంలో వారికి రూ .1.60 కోట్లు ఇవ్వాలని , లేనిపక్షంలో కేసులు పెడతానని బెదిరించారన్నారు.

2021-–2023 లో కొనసాగిన వ్యాపార భాగస్వాములు నలుగురితో  లావాదేవీలన్నీ ముగిసిపోయాయన్నారు.  తాను ఒక్క రూపాయి వారికి బాకీ లేదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదన్నారు.  తన పేర స్టాంప్​ పేపర్​ తీసుకొచ్చి, పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే  ఐదుగురికి రూ .32 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి 60 లక్షల విలువ చేసే ఐదు చెక్కులను తనతో బలవంతంగా రాయించుకున్నారన్నారు.  బలవంతంగా చెక్కులు రాయించుకున్న అంశంపై తాను సిటీ సివిల్​ కోర్టులో దావా వేశానన్నారు.

చిలకలగూడ పోలీసులపై సిటీ పోలీస్​ కమిషనర్​, డీజీపీ లకు ఫిర్యాదు చేశానన్నారు. దీంతో  తనపై కక్ష పెంచుకున్న చిలకలగూడ ఏసీపీ, సీఐ, డీఐలు మూడు రోజుల క్రితం తన వైన్​ షాప్​ పర్మిట్​రూంలో జరిగిన గొడవకు తనను బాధ్యుడిని చేస్తూ, ఠాణాకు పిలుస్తూ, టార్చర్​ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.  ప్రభుత్వం స్పందించి, చిలకలగూడ పోలీసుల నుంచి తనను,  తన కుటుంబాన్ని  కాపాడాలని పాతూరి ధర్మేందర్​ రెడ్డి కోరారు.