తొర్రూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఫిర్యాదు చేసినట్టు తొర్రూరు బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి తమ పట్ల దురుసుగా ఉంటున్నారని, వారం రోజులుగా విధులను బహిష్కరించి కోర్టు వెలుపుల నిరసన తెలిపామన్నారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కలువకొలను ప్రవీణ్ రాజు, జనరల్ సెక్రటరీ ఆర్కే ఘనపురం, ఉపాధ్యాక్షులు అలవాల శ్రీశైలం, సీనియర్ న్యాయవాదులు బండపల్లి వెంకన్న, పొదకంటి యాకాంబరం, మధుసూధన్, ప్రేమ్ చందర్, ముకుందారావు, వల్లపు అయిలోని, బానోత్ లాలు, అశోక్ మైలపాక, మాదగాని నాగరాజు, బొల్లం వెంకటేశ్ ఉన్నారు.