రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో తనకు ప్రాణహాని ఉందని పట్టణంలోని రాంనగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పట్టణంలో నిర్మాణమవుతున్న అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్ కు, అధికారులకు ఫిర్యాదు చేశానని.. తనపై కక్ష పెంచుకున్నారని బాధతుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో పోలీసులతో కుమ్మక్కై వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రి తనను హత్య చేయించాలని చూస్తున్నాడని.. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని కౌన్సిలర్ హెచ్ఆర్సీని కోరాడు. మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని సుధాకర్ రెడ్డి మొర పెట్టుకున్నాడు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్పందించి తనకు రక్షణ కల్పించాలని.. అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
For More News..
కానిస్టేబుల్ విధులు కూడా సీపీనే చేశారు
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్