హైదరాబాద్:కేటీఆర్ బామ్మర్ది ఫాంహౌజ్లో డ్రగ్స్ పార్టీపై లోతుగా దర్యాప్తు జరిపించాలని సైబరాబాద్ పోలీసులకు కాంగ్రెస్ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. ఆదివారం(అక్టోబర్27) సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి వచ్చిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత పోలీసు ఉన్నతా ధికారులను కలిశారు. మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌజ్ లో జరిగిన డ్రగ్స్ పార్టీపై లోతైన దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జన్వాడలోని ఓ ఫాహౌస్ పై నార్సింగ్ పోలీసులు, సైబరాబాద్ SOT పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనిలో ఉన్న ఫామ్ హౌస్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల దిగా గుర్తించారు. భారీ శబ్ధాలతో రాత్రి పార్టీ నడుస్తోందని వచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు రైడ్స్ చేశారు. పోలీసులకు అక్కడ భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు దొరికాయి.
ALSO READ | అమెరికా వీసాకోసం సర్టిఫికెట్ ఫోర్జరీ కేసు..ఇద్దరు హైదరాబాదీలు అరెస్ట్
రేవ్ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు పాల్గొన్నారు. ఎక్సైజ్ శాఖ అనుమతి లేని 10.లీటర్ల ఫారిన్ లిక్కర్(7 బాటిళ్లు) పట్టుబడ్డింది. ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాలు పోలీసులు సైఫర్ డాగ్స్ తో గాలిస్తున్నారు.