- ప్రజావాణిలో కలెక్టర్ కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
చెన్నూరు, వెలుగు: చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ శివారులోని సబ్ స్టేషన్ పక్కన ఉన్న క్రషర్ ను తొలగించాలని చెన్నూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు సోమవారం మంచిర్యాల జిల్లా ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ క్రషర్ నుంచి వస్తున్న దమ్ము ధూళితో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, చాలా మంది అస్తమాతో బాధపడుతున్నారని వాపోయారు.
పంచాయతీ సెక్రటరీతో లోపాయికారీ ఒప్పందం చేసుకొని జనావాసాల నడుమ క్రషర్ నడుపుతున్నారని, దీనిని వెంటనే మూసేయాలని చెన్నూర్ కాంగ్రెస్ నాయకులు సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.