బిర్యానీలో బొక్కలు కొరికితే విరగలేదట.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

బిర్యానీలో బొక్కలు కొరికితే విరగడం లేదని.. అసలు అవి చికెన్ బొక్కలు కావంటూ రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ పై ఓ వినియోగదారుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  ఈ ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళ్తే .. స్థానికంగా ఉన్న రెడ్ బకెట్ బిర్యానీ షాపుకు వచ్చిన వినియోగదారుడు  అక్కడ ఓ బిర్యానీని తిన్నాడు.  అయితే అందులోని చికెన్ బొక్కలు తింటుంటే విరగకపోవడంతో అనుమానం వచ్చి ఇది అసలు చికెన్ కాదని  రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ తో వాగ్వాదానికి దిగాడు.  

ఇది కాస్త పోలీస్ స్టేషన్  వరకు చేరుకుంది.  దీంతో పోలీసులు..  ఫుడ్ ఇన్స్ పెక్టర్ కు సమాచారం అందించారు. ఈ క్రమంలో రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లో ఫుడ్ ఇన్స్ పెక్టర్  తనిఖీలు నిర్వహించారు.  బిర్యానీ రైస్ , లెగ్ పీస్, అయిల్, ఇతర సామాగ్రి నుంచి శాంపిళ్ల తీసుకుని ల్యాబ్ కు పంపించారు. రిపోర్ట్ వచ్చిన తరువాత  చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

అయితే గతంలో సేకరించిన శాంపిళ్ల సంగతి ఏమిటని స్థానిక యూత్ కాంగ్రెస్ నాయకులు ఫుడ్ ఇన్స్ పెక్టర్ ను ప్రశ్నించారు.  వారికి ఫైన్ వేశామని, కట్టారని ఇన్స్పెక్టర్ బదులిచ్చారు.