బీర్లు అమ్మడం లేదంటూ ప్రజావాణిలో ఫిర్యాదు

కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ ఓ యవకుడు ఏకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది. జగిత్యాలలో చల్లని బీర్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ బీరం రాజేష్ అనే యవకుడు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ లతకు వినతి పత్రాన్ని అందజేశాడు. జిల్లాలో కల్తీ మద్యం అమ్ముతున్నారని దీంతో యూరిక్ యాసిడ్ హెల్త్ ప్రాబ్లమ్ వస్తున్నాయని తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశాడు.  జిల్లాలో విచ్చలవిడిగా  బెల్ట్ షాపులు ఉన్నాయని, అందులో  ఒక్కో బీర్ కు రూ. 200 నుంచి 300 వరకు వసూలు చేస్తూ ప్రజల నుండి దోపిడీ చేస్తున్నారని  రాజేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు.